నారద వర్తమాన సమాచారం
తిరుపతి జిల్లా తడ:-
తమిళనాడు మరియు కర్ణాటక కి చెందిన నలుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకొని వారి వద్ద నుండి 20.8 Kg ల గంజాయిని, 1 సెల్ పోన్ ను స్వాదీన పరుచుకున్న తడ పోలీసులు తేది 07.11.2024 ఉదయం సుమారు 09:00 గంటలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తిరుపతి ఎల్. సుబ్బరాయుడు అదేశాల మేరకు,అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తిరుపతి K. రవి మనోహరాచారి సూచనల మేరకు
నాయుడుపేట DSP G. చెంచుబాబు పర్యవేక్షణలో, సూళ్లూరుపేట CI- M. మురళి కృష్ణ, తడ పోలీస్ స్టేషన్ SI అయిన K. కొండప నాయుడు
కి రాబడిన సమాచారం మేరకు మరియు వారి సిబ్బంది సహకారముతో తిరుపతి జిల్లా,
సిటీ జీరో పాయింట్ వద్ద వివిద రకాల బ్యాగులలో గంజాయిని చెన్నై కి తీసుకుపోవడానికి సిద్దంగా వున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిని విచారించి, వారి వద్ద నుంచి సుమారు 3 లక్షల విలువ గల 20.8 Kg ల గంజాయిని, 1 సెల్ ఫొన్ ను స్వాదీన పరుచుకోని కేసు నమోదు చేయదమైనది .
కేసు వివరాలు : తడ PS, Crime No: 162/2024 u/s 8 (c) r/w 20 (b) (ii) (c) NDPS Act
ముద్దాయిల వివరాలు
- దేవరాజ్.A @ దేవా S/o అన్బలగన్, వయస్సు 26 సం.,లు, కులం: ఆది ద్రావిడ, No: 64, ప్రదాన సాలై, గంగై అమ్మన్ కొయిల్ వీధి, పెరియ వెన్మని గ్రామము, మధురాంతకం తాలుకా, కాంచీపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రం.
- నరేష్ S @ రాకేష్ s/o సుందరమూర్తి, వయస్సు: 22 సం.లు, కులము: ఆది ద్రవిడ, No: 2 మెయిన్ రోడ్ అరియనూర్ గ్రామము, పెరియ వెన్మని పోస్ట్, మధురాంతకం తాలుకా, కాంచీపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రం.
- హరిహరన్ మార్సన్ @ హరి s/o మార్సన్, వయస్సు: 26 సం.లు, కులము: ఆది ద్రవిడ, No:63 తిరువళ్ళువర్ స్ట్రీట్, కామరాజ పురం, పట్టాభిరామ్, తిరువళ్ళూరు జిల్లా, చెన్నై-72.
- నారాయణ.C s/o చంద్రప్ప, వయస్సు: 28 సం.,లు, కులము: బలిజ, పోలేరమ్మ గుడి దగ్గర, కనకదాస్ స్ట్రీట్, కల్కేర, KR పురం, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం. పై కేసులో ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేయడములో ప్రతిభ కనబరిచిన సూళ్లూరుపేట CI – M. మురళి కృష్ణ , తడ పోలీస్ స్టేషన్ SI అయిన K. కొండప నాయుడు మరియు వారి సిబ్బందిని అభినంధించి రివార్డ్ రోల్ కొరకు ఉన్నతాధికారులకి ప్రతిపాదనలు పంపడమైనది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.