నారద వర్తమాన సమాచారం
ఫైళ్ల దహనం కేసులో సీఐడీ దూకుడు
ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత అనుచరుడుగా ఆర్డీవో మురళి వ్యవహరించారు. ఈయన హయాంలోనే, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ప్రధాన నాయకులు పేదల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన భూములను ఫ్రీ హోల్డ్ జాబితాలో ఎక్కించడంలో ఆర్డీవో మురళి కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసు ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం (AP Govt) చాలా సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దహనం కేసు విచారణలో సీఐడీ (CID) అధికారులు దూకుడు పెంచారు. ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూర్వపు ఆర్డీవో మురళికి చెందిన నివాసాలలో ఈరోజు (శనివారం) ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లోని మురళి నివాసంతో పాటు, తిరుపతిలో ఆయన కుమారుడు నివసిస్తున్న ఇంటిలోను ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఫ్రీ హోల్డ్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించడంలో మురళి కీలక పాత్ర పోషించారనే అభియోగాలు ఉన్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.