నారద వర్తమాన సమాచారం
కడప జిల్లా
పులివెందుల
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్
పోలీసుల అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వ తీరుపై ఎంపి అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
వైసిపి కార్యకర్తలను, నాయకులను పగలు రాత్రిళ్ళు తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
మా పిఏ రాఘవరెడ్డి నిత్యం పోలీసులతో మాట్లాడే వ్యక్తి
కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటికి రాత్రులు వెళ్లి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారు
లాఠీలతో డోర్లు కొట్టి ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి భయపెట్టారు
భయాందోళన గురి చేయకుండా స్టేషన్కు రావాలని పిలిచినా రాఘవ వెళ్లేవాడు
అలాంటిది ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంది ?
ఇలా రాత్రిళ్ళు పోలీసులు చేస్తున్న తీరు రౌడీలను తలపిస్తుంది
ప్రతిరోజు రాత్రిళ్ళు వైసిపి కార్యకర్తలను భయాందోళనకు గురి చేయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారు
కూటమి ప్రభుత్వ మాటలు విని నడుచుకుంటున్న పోలీసులను చూసి భయపడేవారు ఎవరూ లేరు
వర్ర రవీంద్రారెడ్డిని నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎల్లో మీడియానే రాసింది
కానీ పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు
వర్ర రవిని పోలీసుల అరెస్టు చేయలేదని…వైసీపీ సోషల్ మీడియా అంతా తప్పుడు ప్రచారం చేస్తోందని…
వర్రా రవి అరెస్టుకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని… వర్రా రవికి ఏదైనా జరిగితే వైసిపిదే బాధ్యత అంటూ బీటెక్ రవి మాట్లాడారు
వాస్తవాలు తెలియకుండా బీటెక్ రవి ఇలా అబద్ధాలు మాట్లాడితే ఫూల్ కావడం తప్ప మరొకటి కాదు
నిన్న రాత్రి అంతా కడప డిటిసిలో వర్రా రవిని వేధించారు
కర్నూల్ రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీలు దగ్గరుండి వర్రా రవిని వేధించారు
తప్పుడు కేసులు బనాయించాలని వర్రా రవిని పోలీసులు వేధిస్తున్నారు
వర్రా రవి, వైసిపి కార్యకర్తల పట్ల పోలీసులు చేస్తుంది తప్పు
పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరు
పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
తక్షణం వర్రా రవిని కోర్టులో హాజరు పరచాలి
టిడిపి నాయకుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్న పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను
టిడిపి నేతల చెప్పుడు మాటలు మానుకొని
పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించాలి
పోలీసుల తీరు మార్చుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలకు ఎవరు బెదిరే వారు ఇక్కడ లేరు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.