నారద వర్తమాన సమాచారం
ఏజెన్సీలో నాటుసారాయి తయారీపై ఉక్కుపాదం
రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్
చెక్ పోస్టులను పటిష్ట పరిఛి, సరిహద్దులలో విజిలెన్స్ నిఘా పెంపు
ఎంఆర్ పి ఉల్లంఘనకు పాల్పడితే షాపుల లైసెన్సు రద్దు
ఏజెన్సీ ప్రాంతంలో నిషేదిత నాటు సారాయి తయారీ పట్ల కఠిన నియంత్రణ పాటించాలని రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ అదేశించారు. నూతన మద్యం విధానం మేరకు ఎట్టి పరిస్ధితులలో నాటు సారా వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. శనివారం రాష్ట్రంలోని ఏలూరు డిపో , జంగారెడ్డి గూడెం అబ్కరీ స్టేషన్లను నిషాంత్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా అయా ప్రాంతాలలో మీడియాతో మాట్టాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.99కి క్వార్టర్ బాటిల్ నాణ్యమైన మద్యం తగినంత సరఫరా చేస్తున్నామని నిషాంత్ కుమార్ వివరించారు. తెలంగాణ సరిహద్దులలోని చెక్ పోస్టులను మరింత పటిష్ట పరుస్తున్నాని, సరిహద్దులలో విజిలెన్స్ నిఘాను పెంచామని స్పష్టం చేసారు. సరి:హద్దులలో మరింత అప్రమత్తత ఉండాలని అబ్కారీ అధికారులను అదేశించారు. తన పరిశీలనలో ఎక్కడా గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఎదురుకాలేదని , ఎవరైనా ఇందుకు భిన్నంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మారిన నిబంధనల మేరకు ఎంఆర్పి పాటించకపోతే ఒక సారి మాత్రమే జరిమానాకు అవకాశం ఉందని, రెండో సారి షాపు లైసెన్సును రద్దు చేస్తామని పేర్కొన్నారు. బెల్టు ఫాపులను సైతం అంగీకరించబోమని నిబంధనలకు భిన్నంగా జరిగే ఏ వ్యవహారాన్ని ఉపక్షించ వద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన అదేశాలు జారీ చేసారని నిషాంత్ కుమార్ తెలిపారు. వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలతో స్టేషన్ ప్రాంగణం నిండిపోగా, వాటిని నిబంధనల ప్రకారం తరలించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసి అబ్కారీ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని అదేశించామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.