నారద వర్తమాన సమాచారం
మంత్రి మీడియా సమావేశంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాల పై ఆగ్రహం. వ్యక్తపరిచారు
ఏలూరు జిల్లా.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి..
మంత్రివర్యులు మీడియా సమావేశం లో మాట్లాడుతూ..
గత వైఎస్ఆర్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవితకాలం నేనే అధ్యక్షుడిగా ఉండాలంటూ కలలు కంటున్న జగన్ కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో నూతన బడ్జెట్ ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.
ప్రతిపక్షం కూడా లేని పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతూ కాలం గడుపుతున్నారని అన్నారు.
తల్లికి చెల్లికి రాష్ట్రానికి అన్యాయం చేసిన జగన్ ఈరోజు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంది అని అన్నారు..
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు..
అలాగే వైసిపి నాయకులు మాట్లాడే మాటలు వారు రాసే రాతలు చూస్తుంటే చూడడానికి కూడా సిగ్గు వేసే పరిస్థితి వచ్చిందని అన్నారు..
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు..
గత ప్రభుత్వంలో విధ్వంసం చూసామని.
ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూస్తారని.
గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులను సైతం మింగేసారని.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కావలసిన నిధులు కేటాయించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.