నారద వర్తమాన సమాచారం
కూటమి ప్రభుత్వంతోనే పల్నాడుకు మేలు, మంచిరోజులు: తెదేపా నేతలు
కూటమి పార్టీల ఆధ్వర్యంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు ఆత్మీయ సన్మానం
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు డోలా, గొట్టిపాటి, ఎంపీ లావు, జూలకంటి, చదలవాడ
దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వినుకొండ, పల్నాడుకు గుర్తిం పు, మంచి రోజులు వచ్చాయన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న అండదండలతో సమష్టిగా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. చీఫ్‌విప్‌గా ఎంపిక అయిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు శనివా రం వినుకొండ గంగినేని ఫంక్షన్ హాల్‌లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చదలవాడ అరవిందబాబు హాజరై చీఫ్ విప్ జీవీని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ 5ఏళ్లుగా పల్నాడు జిల్లాలో వైసీపీ దుర్మార్గపు, అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరిదీ ఈ విజయం, ఈ గౌరవమన్నారు. ఇలాంటి ఒకరోజు కోసం 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కోసం ప్రజలంతా కోరుకున్నారని, ఇప్పుడు చీఫ్‌విప్ రూపంలో అయినా వినుకొండకు క్యాబినెట్ హోదా అందడం గర్వకారణంగా అనిపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్-2047 సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని, ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని తెలిపారు. ఒకపక్క ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు , మరోపక్క సీనియర్ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి, కన్నా, యరపతినేని, తొలిసారి ఎమ్మెల్యేలైన అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్ కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అలానే డైనమిక్ లీడర్ గొట్టిపాటి రవికుమార్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని
అందరం కలసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లేలా చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహకారంతో అసెంబ్లీని సజావుగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని తెలిపారు. జన్మభూమి స్ఫూర్తితో పల్నాడు జిల్లా, వినుకొండ ప్రజల రుణం తీర్చుకోవడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. అనంతరం మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ జీవీని చీఫ్ విప్‌గా నియమించినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా అన్నారు. తాను మంత్రిగా, జీవీ చీఫ్ విప్‌గా, లావు శ్రీకృష్ణదేవరాయలు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నా దీనంతటికీ కారణం ఐదేళ్లుగా కార్యకర్తల పోరాటాలే అన్నారు. పదవి అనేది అలంకరణ కాదని గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన బాధ్యతగా పేర్కొన్నారు . గతానికంటే మరో 3-4 గంటలు ఎక్కువ కష్టపడి, ఈ గెలుపును నిలబెట్టాల్సి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, దేశంలో రూ.4 వేలు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. రాబోయే అర్హులైన అందరికీ కొత్తపింఛన్లు ఇస్తామ న్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టిందని, మరెన్నో కార్యక్రమాలు చేపట్టాడానికి సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి ఉండగా రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లి పోయిందని, అంతటి ఆర్థిక సంక్షోభంలోనూ ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.