నారద వర్తమాన సమాచారం :చింతలపాలెం:ప్రతినిధి
ఉపాధిహామీ పథకానికి సూచనలు పాటించాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్
సూర్య పేట జిల్లా, చింతలపాలెం మండలం
చింతలపాలెం మండలం లో గ్రామపంచాయతీ లో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ పథకం కూలీలకు కనీసం వసతులు అయినటువంటి త్రాగునీరు,నీడ కొరకు టెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఈరోజు పని చేసే ప్రదేశం వద్ద గ్రామ కార్యదర్శి ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామం నందు నిరుపేద లైన ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉపాధి ఎండ తీవ్రతలు 42 డిగ్రీస్ సెంటీగ్రేడ్ పైన ఉంటున్న దృష్ట్యా మరి ఇక్కడ కూడా కలెక్టర్ ఆదేశానుసారం పని ప్రదేశంలో టెంటు కూలింగ్ వాటర్ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగింది గ్రామాల్లో ఉన్న ప్రతి కూలీకి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి అన్ని వసతులు సౌకర్యాలు కల్పి స్తున్నాం అని తెలియజేయడం జరిగినది అలాగే వారికి పని పైన అవగాహన కల్పిస్తున్నట్టు తెలియజేయడమైనది జరిగినది అలాగే వారికి పని పైన అవగాహన కల్పిస్తూ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కలిగించబడుతుంది అలాగే 272 నుండి 300 రూపాయలు పెంచడం జరినది అని తెలుపుతూ దీనికి కూలీలు కొలతలు ప్రకారం పనిచేయవలసిందిగా వారికి సూచనలు సూచించనైనది కావున ఇట్టి ఉపాధి హామీ పనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందవలసిందిగా సూచించనైనది మరియు ఉపాధి హామీ పని (కరువు పని) వద్ద ఉన్న గ్రామస్తులు సౌకర్యాలు కల్పించడంలో గ్రామ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వసతులు ఏర్పాటు చేయడం వలన ఉపాధి హామీ పనికి రావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పవన్ కుమార్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సీనియర్ మేట్ ఎస్.కె అబ్దుల్ రహీమాన్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.