నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా
నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం భారత రాజ్యాంగం ప్రస్తావన చేస్తూ భారత రాజ్యాంగాన్ని 26, నవంబర్ 1949 న రాజ్య సభ ఆమోదం తెలపడం జరిగిందని, తదుపరి 26 జనవరి, 1950 నుండి అమలులోకి వచ్చిందని తెలిపి,
పోలీస్ అధికారులు, సిబ్బంది రాజ్యాంగబద్ధంగా నడవాలని ప్రతిజ్ఞ చేయించారు.
రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర ముఖ్యమైనది.
రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణ.
పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పౌరుల ప్రాథమికహక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించాలి అని ఎస్పీ తెలిపారు.
అంటరానితనం, వివక్ష నిర్ములించాలని అలుపెరగని పోరాటం చేసిన కృషీవలుడని, అంబేద్కర్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో విద్యనభ్యాసించి, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ JV సంతోష్ ఏ ఆర్ డీఎస్పీ గాంధీ రెడ్డి మరియు ఇతర పోలిస్ అధికారులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.