నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి హైవే ఘోర రోడ్డు ప్రమాదం
దాచేపల్లి :-
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి హైవే రోడ్డు పై గత రాత్రి 26/11/2024, రాత్రి 10:15 గంటలకు పిడుగురాళ్ల-దాచేపల్లి హైవేపై గోప్పుల సాంబయ్య షెడ్, కల్యాణి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కుక్కుమూడి బుజ్జి బాబు (వయసు: 45 సంవత్సరాలు), పిడుగురాళ్లకు చెందిన టెంటు హౌస్ సహాయకుడు, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు క్రిస్టియన్ పేట్, పిడుగురాళ్లకు చెందినవాడు. అతనికి భార్య, రెండు కుమార్తెలు ఉన్నారు.
ప్రమాద వివరాలు:
మృతుడు ఒక ఫంక్షన్‌లో పని ముగించుకుని పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం టైర్ పంచర్ కావడంతో, డ్రైవర్ వాహనాన్ని గోప్పుల సాంబయ్య షెడ్ వద్ద ఆపి, పంచర్ వేయించేందుకు షాప్‌కు వెళ్లాడు. ఈ సమయంలో, మృతుడు వాహనంపై నుంచి దిగిపోయి రోడ్డు అవతలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా, ఒక లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదానికి కారణమైన వాహనం:
లారీ డ్రైవర్ పేరు: నూతలపాటి శాస్త్రి, వయసు: 32 సంవత్సరాలు, పశుపుగల్లు గ్రామం, ప్రకాశం జిల్లా
తదనంతర చర్యలు:
ఎస్సై పాపారావు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదం గురించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించవలసిందిగా ఎస్సై పాపారావు ప్రజలకు సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.