నారద వర్తమాను సమాచారం
తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్?
చత్తీస్గడ్ :
తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దులో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిసింది తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరగ్గా 8 మంది మావోయిస్టు మృతిచెంది నట్టు తెలుస్తుంది,
ప్రజా విముక్తి గరిల్లా సైన్యం ఆవిర్భవించి 24 సంవత్సరాలు అవుతున్న తరుణంలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుపు కోవాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది….
రేపటి నుంచి వార్షికోత్స వాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఒక్కరోజు ముందే చెల్పాక, అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది,
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీ్‌స్ స్టేషన్ పరిధిలోని సీమలదొడ్డి,ఐలాపూర్, అటవీ ప్రాంతం ఉరవసారి గుట్ట సమీపంలో ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతం లో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు సుమారు 20మంది సభ్యులున్న మావోయిస్టు దళం ఎదురైంది.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య 30 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగా యి.అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించగా, 8 మంది మావోయిస్టులు మృతి చెందగా. మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలిసింది,
ఈ ఎన్ కౌంటర్ లో కురుసం మంగు, బద్రు,పాపన్న, నర్సంపేట, ఈ గోలపు మల్లయ్య,మధు, భూపాల పల్లి జిల్లా మహదేవ్ పూర్, ముసాకి దేవల్, కరుణాకర్, జై సింగ్ పార్టీ సభ్యులు, కిషోర్ పార్టీ సభ్యులు, మొ”వారు మరణించారని తెలిసింది,
సంఘటన స్థలంలో తూటాలు, డిటోనెటర్, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, కిట్‌బ్యాగు, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యా యి. ఛత్తీ్‌సగఢ్ పోలీసులకు సమాచారం ఇచ్చి మృత దేహంతోపాటు లభ్యమైన సామగ్రిని స్వాధీన పరుచుకున్నారు.
కాగా కొద్దిరోజులుగా ములుగు ఏజెన్సీలో పోలీసు చర్యలు నివురుగప్పిన నిప్పులా మారాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.