పిరియాడికల్స్( వార, పక్ష, మాస ) పత్రికా సంపాదకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి ఏపీ ఈ ఆర్ యు అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు….
నారద వర్తమాన సమాచారం
ఏలూరు :
స్థానిక మరియు పీరియాడికల్స్(వార పక్ష మాస) పత్రికా సంపాదకుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి మేలు జరిగేలా చూసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ముందుంటుందని రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు చెప్పారు
మంగళవారం ఉదయం ద్వారకాతిరుమలలో జరిగిన ఏలూరు జిల్లా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిన్న పత్రికల పట్ల వారు అనుసరించే విధానాలు కూడా మారుతున్నాయని ఆందోళన చెందారు
అయితే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పత్రికలను నిర్వహించవలసిన బాధ్యత సంపాదకులపై ఉందన్నారు. సంపాదకుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ శక్తివంతం లేకుండా కృషి చేస్తుందన్నారు
సంఘ ఉపాధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ సంపాదకులందరూ సమైక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలమన్నారు
ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ అక్రిడేషన్లు పొందే విషయంలో స్థానిక పత్రికలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు
ఫర్ఫెక్ట్ న్యూస్ సంపాదకులు సోడిశెట్టి శాంత కుమార్ ను రెండవసారి ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ నాయుడు నియమక పత్రాన్ని అందజేశారు
పలు జిల్లాల నాయకులు సంఘ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.