నారద వర్తమాన సమాచారం
మాచవరం ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ నిరోదక చట్టాల అవగాహన కార్యక్రమం
మాచవరం:-
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు మాచవరం ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ నిరోదక చట్టాల అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధులలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్ ఐ కె.సతీష్ పాల్గొని ముఖ్యంగా యువత, మరియు విద్యార్థులు సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని అలాగే యువత బాగుంటేనే రాష్ట్రాలు,దేశం బాగుంటుంది అని అన్నారు
ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం క్షేత్ర స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు వీటి పైన అవగాహన కల్పించి సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా భావి పౌరులుగా తీర్చి దిద్దలనే ముఖ్య ఉద్దేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతిష్ఠాత్మకంగా పాఠశాల ల నందు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల మరియు డ్రగ్స్ గురించి అడిగిన ప్రశ్నల్లో సమాధానాలు ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి బహుమతులుఅందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు కె.సురేష్ బాబు,
జగన్నాధం మాస్టారు, ఇతర ఉపాధ్యాయులుతదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







