Wednesday, February 5, 2025

విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం

నారద వర్తమాన సమాచారం

విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం

సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయు

ఉమ్మడి ఎపిలో మాదిరిగా పెద్దఎత్తున ఐటి అభివృద్ధి: గూగుల్ ప్రకటన

అమరావతి:

రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ గ్లోబల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఎపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్, ఎపి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎంఓయు సందర్భంగా అమరావతి విచ్చేసిన గూగుల్ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ కార్యదర్శి యువరాజ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు పటిష్టమైన ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… తన యుఎస్ఎ పర్యటనలో గూగుల్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలవంతం కావడంపై ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. కొత్తప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలలకే ఆర్సెలర్స్ మిట్టల్/నిప్పన్ స్టీల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్ తో సహా పలు భారీపరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నేతృత్వంలోని ప్రతినిధి బృందం విశాఖపట్నం కోసం ప్రతిపాదించిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించింది. ఈనెల 5న గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివిధ ఎఐ ఇనిషియేటివ్‌లలో సహకరించడానికి ఎంఓయూపై సంతకం చేశామని, మలివిడతగా తమ బృందం భారతదేశంలో గూగుల్ కార్యకలాపాలు, దాని భవిష్యత్తు ప్రణాళికలపై ఒప్పందానికి ఎపికి వచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తమకు కీలక భాగస్వామ్య రాష్ట్రమని బికాష్ కోలే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పెద్దఎత్తున ఐటి పెట్టుబడుల ఆకర్షించడం ద్వారా గణనీయమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధించారని, అదేవిధంగా ఇప్పుడు ఎపిలో ఐటి పరిశ్రమ అభివృద్ధి సాధించగలదన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading