నారద వర్తమాన సమాచారం
లైసెన్స్ తుపాకిని పోలీసులు అప్పగించిన మోహన్ బాబు
హైదరాబాద్
మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవపై మంచు కుటుంబ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో మంచు విష్ణు, మంచు మనోజ్ ల స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. అయితే, ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు మాత్రం పోలీసులను కలుసుకో లేదు. ఆయన నుంచి తాము ఎలాంటి స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు.
గొడవల నేపథ్యంలో లైసెన్స్ డ్ రివాల్వర్ ను హ్యాండో వర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా మంచు విష్ణు తన గన్ ను అప్పగించారు. అయితే, మోహన్ బాబు మాత్రం తన లైసెన్స్ గన్ ను పోలీసులకు ఈరోజు అప్పగించారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట లోని తన యూనివర్సిటీకి వెళ్లారు.
అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ లైసెన్సుడ్ గన్ ను పీఆర్ ఓ ద్వారా డిపాజిట్ చేయించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.