నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన పై సమగ్ర సమాచారం సిద్ధం చేయండి…
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు…
నరసరావుపేట.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులిపాడు పర్యటన పై అధికారుల తో రివ్యూ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా 1 న పల్నాడు జిల్లా పులిపాడు లో పర్యటనకు రానున్నారు. చంద్ర బాబు పర్యటనలో భాగంగా నిర్వహించే గ్రామ సభలో అవసరమయ్యే సమగ్ర సమాచారాన్ని క్రమ పద్ధతిలో క్రోడీకరించి సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. పులిపాడు గ్రామంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
స్థానిక ప్రజా ప్రతినిథులు, అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్ అందుకునే లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. గ్రామ సభ కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపాన ఉన్న ఖాలీ స్థలాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. హెలీ ప్యాడ్ నుంచి గ్రామ సభ ప్రాంగణం వరకూ రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆర్డీవో మురళీ కృష్ణ, డిఎస్పీ జగదీష్, జిల్లా వ్యవసాయ అధికారి మురళి, డీపీవో విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.