నారద వర్తమాన సమాచారం
పల్నాడు బాలోత్సవంలో – ఐగ్రో పాఠశాలకు 21 బహుమతులు
పల్నాడు జిల్లా నరసరావుపేట పి.ఎన్.సి.అండ్ కే.ఆర్.ఇనిస్టిట్యూషన్స్ ప్రాంగణంలో 2024 డిసెంబర్ 28,29 తేదీలలో నిర్వహించబడిన పల్నాడు బాలోత్సవంలో వివిధ సాంస్కృతిక పోటీలలో ఐగ్రో అంతర్జాతీయ పాఠశాల విద్యార్థిని, విద్యార్ధులు పాటల పోటీలు, స్పెల్ బి,ఫోక్ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్,మెమొరీ కాంటెస్ట్, స్టోరీ టెల్లింగ్, మ్యాప్ పాయింటింగ్, పోస్టర్ ప్రజెంటేషన్, బుర్రకథ, క్విజ్ ఆయా సంస్కృతిక పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సల్టేషన్ అన్ని కలిపి 21 బహుమతులు
సాధించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల చైర్మన్ పల్లబోతుల వెంకట్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కేవలం చదువుకే కాక వివిధ రంగాలలో పిల్లలు రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నామని, చదువు,ఆట,పాటల విషయంలో టీచర్లు మరియు మేనేజ్మెంట్ వారు చెప్పగానే సహకరిస్తున్న పిల్లలకు,వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,బహుమతులు గెలిచిన విద్యార్థిని,విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు. పాఠశాల వైస్ చైర్మన్ పల్లబోతుల మురళి బాబు అమెరికా దేశం నుండి వర్చువల్ ద్వారా మాట్లాడుతూ ఈ విజయానికి కృషి చేసిన స్కూల్ మ్యూజిక్ టీచర్ మౌలాలి, డాన్స్ టీచర్ సుహాసిని, యాక్టివిటీస్ కోఆర్డినేటర్ మాధవి టీచర్, పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయటానికి బాలోత్సవం కమిటి వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. ప్రిన్సిపల్ దివి.శేషశాయి మాట్లాడుతూ పిల్లల పండుగ బాలోత్సవం లో పాల్గొన్న విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎండ్లూరి చంద్రబాబు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది విశ్వనాధ్, సాయిబాబా, సాయి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాజీ ఇన్చార్జి సభ్యులు యస్.కె. జిలానీ మాలిక్, వేల్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







