నారద వర్తమాన సమాచారం
కాపర్ వైర్లు కోసం ట్రాన్స్ ఫార్మర్లను దొంగలిస్తే రౌడీ షీట్ మరియు పిడి యాక్ట్ నమోదు చేస్తామ్
కాపర్ వైర్లు కొనుగోలు చేయు పాత ఇనుప కొట్టు వ్యాపారులు, స్టీల్ షాపులపై పోలీసులు నిఘా ఏర్పాటు.
నరసరావుపేట:-
పంట పోలాల్లో ట్రాన్స్ ఫార్మర్ లు దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హెచ్చరించారు… రైతులు తమ పోలాలకు నీరు అందించుకునే నిమిత్తం లక్షల రూపాయలు వెచ్చించి ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు… అయితే కొందరు వ్యక్తులు జూలాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు… వారు పంట పోలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించి వాటిని పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను అమ్ము కుంటున్నారు… ఐనఓలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న 27 కేసులలో నిందితులు అయిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారిని జైలుకు పంపడం జరిగిందని తెలిపారు.
రైతులు లక్షల రూపాయలు వెచ్చించి ట్రాన్స్ ఫార్మర్లను కొనుగోలు చేసి, వ్యవసాయం చేసుకుని పంటలు పండిస్తుంటే, దొంగలు ట్రాన్స్ ఫార్మర్ల లోని కాపర్ వైర్లు కోసం రైతులను నష్ట పరచడం దారుణమన్నారు.. ఈ విధంగా ఏవరైనా నరసరావుపేట డివిజన్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించి వాటి లోని కాపర్ వైర్లును అమ్ముకునే వారిపై శ్రీయుత పలనాడు ఎస్పి ఉత్తర్వుల మేరకు జిల్లలో స్పెషల్ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ట్రాన్స్ ఫార్మర్ల లోని కాపర్ వైర్లు కోనుగోలు చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
డివిజన్ పరిధిలోని అన్ని పాత ఇనుము దుకాణాలు, స్టీల్ దుకాణాల యజమానులు కాపర్ వైర్లు దొంగలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారి సమాచారం తెలిస్తే దగ్గరలోని సంభదిత పోలిసులకు సమాచారం అందించాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.