నారద వర్తమాన సమాచారం
శిఖా శాంసన్ ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగులకు క్రీడా పోటీలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రోసూరు పిహెచ్సి మహిళా ఉద్యోగులకు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలను వైద్యాధికారులు డాక్టర్ ధనుష్ డాక్టర్ సిరి చందన లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ కబాడీ క్రికెట్ త్రాడు లాగుడు బాల్ బ్యాట్మెంటన్ మొదలైన పోటీలు మహిళా సిబ్బందికి నిర్వహించినట్లు విజేతలకు వైద్యాధికారుల చేతుల మీదగా ఈనెల 11వ తేదీ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.