నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో భారీ మార్పులు చేశారు.
ఇటీవల కాలంలో చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేర్పులు చేశారు. మావోయిస్టులను సైతం ఎదుర్కోనేల సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్ ను చేర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా.. మరో ఆరుగురు కమాండోలతో ఈ కౌంటర్ యాక్షన్ టీమ్ సీఎంకు భద్రత ఇవ్వనుంది. ఈ కౌంటర్ యాక్షన్ టీమ్కు SPG ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అయితే గతంలో సీఎం చంద్రబాబు నాయుడిపై జరిగిన దాడుల నేపథ్యంలో Y+ కేటగిరి సెక్యూరిటీ కాస్త.. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత Z కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ యాక్షన్ టీమ్ ను కూడా సీఎం భద్రతా వలయంలోకి రానుంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు భద్రత ఇకపై కట్టుదిట్టంగా మారనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.