నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
భయమెరుగని వడ్డెర్లు,బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపిన వీరుడు వడ్డే ఓబన్న – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1807 జనవరి 11 వ తేదీ నాడు రేనాటి ప్రాంతంలోని నొస్సం గ్రామంలో వడ్డే సుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు వడ్డే ఓబన్న జన్మించారు.
ఓబన్న సంచార జాతి వడ్డెర కులానికి చెందినవారు.
భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో రేనాటి పాలగాళ్లకు మరియు కంపెనీకి తవర్జీ (అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినందుకు గాను పాలగాళ్లకు ఇచ్చే భత్యం) విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటంగా మారాయి.
ఆ పోరాటంలో ముఖ్యమైనది నాస్యం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు. ఈ భీకర పోరులో సైనాధ్యక్షుడి గా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్ర అనర్వచనీయం.
భయమెరుగని వడ్డెర్లు, బోయలు మరియు చెంచుల తో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడం లో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు వడ్డే ఓబన్న అని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్ సత్తిబాబు మరియు ఇతర పోలిస్ అధికారులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.