
శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)కి మాతృవియోగం.
మాతృమూర్తికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
జగ్గయ్యపేట నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) కి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి శ్రీరామ్ సక్కబాయి సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాదు . జగ్గయ్యపేటలోని తాతయ్య నివాసానికి వెళ్లి శ్రీరామ్ సక్కబాయి పార్ధీవ దేహాన్ని సందర్శించారు. ఆమె పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.
శ్రీరామ్ సక్కబాయి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధించారు. శ్రీరామ్ రాజగోపాల్ ని పరామర్శించి, ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం , పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







