నా రధ వర్తమాన సమాచారం
ప్రాణాలకు ముప్పు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత – సిపిఐ,ప్రజా,రైతు సంఘాలు
పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక గాంధి పార్క్ ఎదురు ఎర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సిపిఐ,ప్రజా,రైతు సంఘాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన దర్న నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని గత 50 రోజులుగా ఢిల్లీ నగరంలో ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దలేవాల్ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంమే పూర్తి బాధ్యత వహించాలని కేంద్రాన్ని హెచ్చరించారు. దలే వాల్ ఆమరణ దీక్ష పోరాటానికి మద్దతుగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని గాంధీ పార్క్ వద్ద మంగళవారం నాడు సంఘీభావ దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ , ప్రజా,రైతు సంఘాలతో కలసి పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే పోరాటం జరుగుతుందని, దలేవాల్ ఆమరణ దీక్ష దేశంలోని రైతాంగం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగిందని, రైతులకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించడానికి వచ్చిన రైతాంగాన్ని పోలీసులతో లాఠీలతో ఉద్యమాన్ని అణచివేయడానికి చూస్తున్నారని దేశ రైతాంగం కన్నెర్ర చేస్తే మోడీ లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎముకలు కోరికే చలిలో కూడా వెన్ను చూపకుండా 750 మంది పైగా రైతుల ప్రాణాలు పోయినా కూడా వెనుతిరగకుండా 13 నెలలపాటు జాతీయ రహదారులను దిగ్బంధం చేసి చారిత్రక వీరోచిత పోరాటం చేసి దేశ ప్రధాని చేత ప్రజలకు రైతాంగానికి క్షమాపణలు చెప్పించిన ఘనత రైతులకే దక్కుతుందని కొనియాడారు. దేశానికి నేను కాపలాదారునని చెప్పుకుంటున్న మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ రైతులతో పాటు దేశ ప్రజలను మోసం చేస్తూ నిజానికి అదాని,అంబానీ ఆస్తులకు కాపలకాస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను సంస్థలను అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రైవేట్ పరం చేస్తూ, దేశంలోని వ్యవసారంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్న కుటిల యత్నాలను రైతాంగం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను దేశ రైతాంగం చారిత్రాత్మకమైన పోరాటం ద్వారానే నిలువరించగలిగామని ఆయన తెలిపారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కూడా రైతు సంఘాల మద్దతు,పోరాటాలతో ప్రముఖ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దలైవాల్ లాంటి వీరుల పోరాట ఫలితంగా రైతుల పంటకు చట్టబద్ధత సాధించి తీరుతామని అన్నారు. రైతాంగం చేస్తున్న పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అణిచివేత చర్యలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, దలైవాల్ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్, ప్రముఖ న్యాయవాది సీజే ప్రతాప్ సహాయ కార్యదర్సులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి షేక్ గని, సుబాబుల్ జామాయిల్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనిమి రెడ్డి, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్.కె.జిలానీ మాలిక్,వినుకొండ సిపిఐ కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు,చిలకలూరిపేట ఏరియా సీపీఐ ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు,నరసరావుపేట సీపీఐ కార్యదర్శి సత్యనారాయణ రాజు,AIYF పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని,Aiyf రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు యం.నాగేశ్వరరావు,సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య,అప్పరాజు పవన్,చిన్న జాన్ సైదా,శ్రీనివాసరెడ్డి, జక్రం తదితరులు పాల్గొని సంఘివ భావం తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.