నారద వర్తమాన సమాచారం
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి గారు
రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి శ్రీ కొలుసు.పార్ధ సారధి గారు విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రిగారి వాహనం లో ఆసుపత్రికీ పంపించి తన మానవత్వాన్ని చూపించారు.
ఈ రోజు పార్ధసారధి గారి నివాసం నుండి బయలుదేరి మంత్రివర్గ సమావేశానికి వెళ్తుండగా పమిడిముక్కల మండలం కనుమూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి గారు చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.వెంటనే తన కాన్వాయి లోని వాహనాన్ని పంపించి హాస్పటిల్ కు తీసుకొని వెళ్ళి వైద్యం చేయించమని తన సిబ్బందిని ఆదేశించారు. వైద్యులతో మాట్లాడి ప్రమాదానికి గురి అయిన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.