నారద వర్తమాన సమాచారం
పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్….
పిడుగురాళ్ల :-
దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని నిర్వహించనునట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ నెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు తగిన శ్రద్ధ చూపాలన్నారు. నెల కొకటి చొప్పున 12మాసాలకు 12 థీమ్‌లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమాన్ని క్యాంపెయిన్ మోడ్‌లో నిర్వహించాలని మంత్రి నారాయణ సూచించారు.
పై కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఈరోజు పలు సెంటర్లు, మరియు పలు వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో మెయిన్ రోడ్లపై ఉన్న చెత్తను క్లీన్ చేయించారు పట్టణ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేకృషి చేస్తున్నామని కమిషనర్ అన్నారు.
అన్న క్యాంటీన్ సందర్శించి క్యాంటీన్లో ఫుడ్ నాణ్యతను పరిశీలించారు మరియు క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని క్యాంటీన్ నిర్వహణ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది కూటమి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.