నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్లమున్సిపల్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
పిడుగురాళ్ల :-
పిడుగురాళ్ల పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ . జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు . తదుపరి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26/1950న భారత రాజ్యాంగం దేశ వ్యాప్తంగా అమలు లోకి వచ్చిందని ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని తెలిపారు.
రాజ్యాంగం మనకు అందించిన మౌలిక హక్కులను, కాపాడుకుంటూ,ప్రాథమిక విధులను నిర్వర్తిస్తూ దేశాభివృద్ధికి
కృషి చేయాలని అన్నారు
కార్యక్రమం అనంతరం కమిషనర్ పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్లు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ స్టాఫ్ మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.