నారద వర్తమాన సమాచారం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పీజిఆర్ఎస్ ) కు వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు
ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాలి
పీజిఆర్ఎస్ కు32 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్
పి అరుణ్ బాబు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పీజిఆర్ఎస్ ) కు వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు
కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 32 వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది అర్జీదారులు తమ వినతులను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయానే నమ్మకంతో నలుమూల ప్రాంతాల నుంచి అర్జీదారులు ఇక్కడకి వస్తుంటారని అన్నారు. అటువంటి వారి సమస్యలను సావధానంగా విని, సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఆ పరిష్కారంతో అర్జీదారు సంతృప్తి చెందాలని సూచించారు.ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరిష్కారం చూపాలని ఉద్బోదించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ , రెవెన్యూ డివిజనల్ అధికారి మధు లత , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.