నారద వర్తమాన సమాచారం
మెగా పశు వైద్య శిబిరాలను ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ బాబు. ఐ ఏ ఎస్….
ములకలూరు :-
నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రము లోని పశుపోష కులకు అండగా నిలవాలనే సదు ఉద్దేశ్యంతో రాష్ట్రమంతట ప్రతిగ్రామములో ఒకేసారి జనవరి 20వ తారీకు నుండి 31 వ తారీకు వరకు పశుఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం లో భాగంగా ది 28.01.2025 న పశు వైద్య శాల ములకలూరు గ్రామములో మెగా పశువైద్య శిభిరం, లేగ దూడల ప్రదర్శన మరియు జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పి. అరుణ్ బాబు ప్రారంబించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ పశుగణబివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ వారు ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు తో ముచ్చటించి నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులని రైతులు ప్రతి ఒక్క దూడ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని కోరారు. జీవాలకు స్వయంగా నట్టల నివారణ మందును త్రాగించారు. ఈ కార్యక్రమంలో కల్లెక్టర్ గారు పాడి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 1962 పశు వైద్య సంచార వాహనం యొక్క విశిష్టతను తెలుసుకొని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరాడు అది విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మినీ గోకులం బహు వార్షిక క్షేత్ర సాగు పథకాలను రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్, పశు బీమా పథకాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలియచేసారు. లేగ దూడల ప్రదర్శనలో 52 దూడలు పాల్గొనగా ఎపింక చేసిన 3 దూడలకు ప్రదను, ద్వితీయ తృతీయ బహుమతులు మరియు మిగిలిన అన్ని దూడలకు గౌరవార్దక బహుమతులు అందచేసారు.
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. కె. కాంతారావు ఆదునిక సాంకేతికతో శాస్త్రీయ యాజమాన్య పద్దతులను అవలంబించుకొని పాలు, మాంసం, గుడ్లు మరియు పశువులలో పునరుత్పత్తి సామర్ధ్యం పెంచుతూ రాష్ట్ర స్థూల ఆదాయం ను పెంపొందించే దిశగా లక్ష్యాలు పెట్టుకొని పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు.
ఉపసంచాలకులు, డి ఎల్ డి ఏ గుంటూరు డా. బాల శంకర్ మాట్లాడుతూ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 90 శాతం కచ్చితత్వంతో పెయ్య దూడలను పుట్టించడం జరుగుతుందని మరియు పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మేలుజాతి దూడలు పుడతాయని ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి. మేరీ రత్నం, ములకలూరు సర్పంచ్, డా. కె. రామచంద్ర రావు, సహాయ సంబాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల, నరసరావుపేట, డా. సి. హెచ్ . కోటి రత్నం, సహాయ సంచాలకులు, ఉపసంచాలకుల వారి కార్యాలయం మరియు పశు సంవర్ధక శాఖ సిబ్బంది మరియు డా. ఎమ్ . అర్జున రావు, పశు డా. కలావతి, డా, స్వర్ణలత, డా. శ్రీదర్ రెడ్డి, డా. కె . శ్రీకాంత్, డా. సత్యనారాయణ రెడ్డి మరియు శ్రీమతి. మధులత, రెవిన్యూ డివిజనల్ అధికారి, నరసరావుపేట, శ్రీమతి. క్రిష్ణ కుమారి, మండల పరిషద్ డెవలప్మెంట్ అధికారి, నరసరావుపేట వారు పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.