నారద వర్తమాన సమాచారం
వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త ప్రకటించారు.
దేశవ్యాప్తంగా వైద్య సీట్లను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలియజేశారు. 2025 బడ్జెట్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన సీతారామన్ వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం కనీసం 10,000 వైద్య సీట్లు పెంచనున్నట్లు తెలిపారు.
రాబోయే ఐదు సంవత్సరాల లో మొత్తం 75,000 వైద్య సీట్లు పెంచే యోచనలో ఉన్నామని చెప్పారు.
అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లు కూడా ఈ బడ్జెట్‌లో కీలకమైన ప్రకటనలు అందుకున్నాయి.
సీతారామన్ తెలిపినట్లుగా, ఈ IIT లలో సీట్ల సంఖ్యను రాబోయే 10 సంవత్సరాలలో వందశాతం పెంచనున్నట్లు ఆమె ప్రకటించారు.
2014 తరువాత ఏర్పాటు చేసిన ఐదు ఐఐటీలకు అదనపు మౌలిక సదుపాయాలు అందించి సుమారు 6,500 విద్యార్థులకు లాభం కలగాలని ఆమె చెప్పారు.
ఇంకా, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు సీతారామన్ వెల్లడించారు.
“Make IN India , Make For The World” కార్యక్రమాలకు అనుగుణంగా, యువతను తగిన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ఈ కేంద్రాలు కీలకపాత్ర పోషించనున్నాయని చెప్పారు.
అదనంగా, సుమారు రూ.500 కోట్లతో “AI For Education” పై ఒక ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.