Tuesday, February 4, 2025

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి గెలుపుకు కూట‌మి నేత‌లు కృషి చేయాలి.విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్.

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి గెలుపుకు కూట‌మి నేత‌లు కృషి చేయాలి.

జ‌గ‌న్ కు అధికారి ఇస్తే… రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లారు.

కోడ్ ముగియ‌గానే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్, అన్న‌దాత సుఖీభ‌వ‌, మెగా డిఎస్సీ.

కూట‌మి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.

వైసీపీ అబద్ధాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్టాలి

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్.

నరసరావుపేట :-

ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ కూట‌మి అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ విజ‌యానికి అంద‌రూ క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశం సోమ‌వారం జ‌రిగింది. మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూట‌మి నేత‌లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడు నెల‌ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమ‌ పెన్ష‌న్ల కోసం అత్య‌ధిక వ్య‌యం చేస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక్క‌టే అన్నారు. వంద‌ల కోట్ల రూపాయిల‌తో రోడ్ల నిర్మాణాలు, మ‌ర‌మ‌త్తులు నిర్వ‌హించామ‌ని వెల్ల‌డించారు. అన్నా క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌, ఉచిత‌ గ్యాస్ సిలెండ‌ర్లు పంపిణీ వంటి ఎన్నో కార్య‌క్రమాల‌తో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమానికి ఒక కొత్త నిర్వ‌చ‌నం చెప్పింద‌ని తెలిపారు. ఎన్నిక‌ల కోడ్ ముగిసిన వెంట‌నే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్ ప‌థ‌కం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో పాటు మెగా డిఎస్సీ కూడా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంద‌న్నారు. ఇటువంటి కార్య‌క్ర‌మాల‌న్నింటినీ ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా తీసుకెళ్లాల‌ని కూట‌మి నేత‌ల‌కు, కార్య‌కర్త‌ల‌కు మంత్రి గొట్టిపాటి పిల‌పునిచ్చారు.

ఒక్క అవ‌కాశంతో… అంధ‌కారంలోకి రాష్ట్రం.

ఒక్క అవ‌కాశం అంటూ రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అంధ‌కారంలోకి నెట్టేసింద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు ఒక‌సారి జ‌గ‌న్ ను న‌మ్మి అధికారం క‌ట్ట‌బెడితే… రాష్ట్రాన్ని 20 సంవ‌త్స‌రాలు వెన‌క్కి తీసుకెళ్లార‌ని ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వం చేసే మంచి కార్య‌క్ర‌మాల‌ను కూడా చెడుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. నిజం నోరు దాట‌క ముందే అబ‌ద్ధం ఊరు దాటుతుంద‌న్న సామెత‌… వైసీపీ విష ప్ర‌చారాల విష‌యంలో నిజ‌మ‌వుతుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లకు మంచి చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో వైసీపీ నేత‌ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌న్నారు. మీడియా, సోష‌ల్ మీడియాల సాక్షిగా వైసీపీ శ్రేణులు చేస్తున్న విష, చెడు ప్ర‌చారాల విష‌యంలో కూట‌మి నేత‌ల‌తో పాటు ప్ర‌జ‌లూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్టేలా కూట‌మి నేత‌లు కూడా ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌న్నీ ప్ర‌జ‌ల్లోకి మ‌రింత తీసుకు వెళ్లేలా ప్ర‌చారం చేయాల‌ని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అతి విశ్వాసంతో ఎవ్వ‌రూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని కూట‌మి నేత‌ల‌కు మంత్రి హిత‌వు ప‌లికారు. వైసీపీ ఒక‌సారి అధికారం చేప‌ట్ట‌డం వ‌ల్ల‌ జ‌రిగిన త‌ప్పుకు అన్ని విధాలా రాష్ట్రం ఎంతో న‌ష్ట పోయింద‌న్నారు. మ‌రోసారి ఇటువంటి త‌ప్పులు పున‌రావృతం కాకుండా ఉండాలంటే కూట‌మి అభ్య‌ర్థుల గెలుపుకు నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని కోరారు. ఇక‌పై జ‌ర‌గ‌బోయే ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధించాల‌న్నారు. కార్యక్ర‌మంలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ తో పాటు ప‌లువురు కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading