నారద వర్తమాన సమాచారం
వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్య పై స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బత్తుల పద్మావతి
సుమోటోగా కేసు విచారణ చేపట్టిన కమిషన్
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన్ పీఠం వేద పాఠశాలల్లో నాలుగవ ఏడాది చదువుతున్న సాయి శివ సూరజ్ (16 సంవత్సరాలు) గత నెల 8వ తారీఖున ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని, తల్లిదండ్రులకు కడుపుకోతకు గురిచేసిందని వారికి బాలల హక్కుల కమిషన్ సానుభూతి తెలుపుతుందని ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ విచారణ చేస్తున్నామని ఈ నేపథ్యంలో వేద పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి జరిగిన సంఘటనపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు.
వేద పాఠశాల ప్రిన్సిపాల్ మరియు గురువులను సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఆగమన వేద పాఠశాలలో విద్యను 147 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని వారికి అందుతున్న సౌకర్యాలను గురించి ఆరా తీశారు.
హాస్టల్లోనే వంటశాలను డైనింగ్ హాలను వసతి గృహాలను రికార్డులను వారికి పెట్టే ఆహారాన్ని పరిశీలించారు.
అపరశుభ్రమైన వాతావరణం లో ఉన్నదని కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా బూజులతో నిండి పోయిందని డైనింగ్ హాల్ కూడా అపరశుభ్రమైన వాతావరణంలో ఉన్నదని మెయింటెన్స్ సరిగ్గా లేదని ప్రిన్సిపల్ పై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన పిల్లలను ఎలాంటి వాతావరణంలో ఉంచుతామ అని ప్రశ్నించారు.
పరివేక్షణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
147 మంది పిల్లలు ఉంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి వైద్య సదుపాయాలను నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.
ప్రతినెల మండల అధికారులు వేద పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఇక్కడ విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని బూస్టరు వ్యాక్సిన్, టీకాలు ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారిని ఆదేశించారు
ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదయిందని నడుస్తుందని బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
తదుపరి కోటప్పకొండ తిరుణాలపై ఎండోమెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
తదుపరి లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సందర్శించి రికార్డులను పరిశీలించారు.
బాలింతలలో రక్తహీనత పౌష్టికాహారం లోపం లేకుండా చూడవలసిన బాధ్యత అంగన్వాడి కేంద్రాలపై ఉందన్నారు.
ఫోర్ట్ ఫైడ్ రైస్ కందిపప్పు నూనె గుడ్లు బాల సంజీవని కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోటప్పకొండ ఈవో చంద్రశేఖర్ సిడిపిఓ ఉమామహేశ్వరి డిప్యూటీ తాసిల్దార్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ఐసి వై ప్రశాంత్ కుమార్ పిడి ఆఫీసు పిఓ ఆదిలక్ష్మి ఈవో ఆఫీస్ అంగన్వాడి సూపర్వైజర్స్ ఎం వాణి జి పార్వతి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.