నారద వర్తమాన సమాచారం
ప్రతి ఇంటా ప్రగతి.. అదే పి-4 పాలసీ లక్ష్యం. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
జీరో పావర్టీ, పి-4 అమలు ప్రణాళికపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్
ప్రభుత్వ ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందని.. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయనున్న పి-4 ప్రణాళికపై.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ హాలు నుండి.. జిల్లా కలెక్టర్ తోపాటు.. జేసీ , అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీఎస్ విసి ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీరో పావర్టీని సాధించే దిశగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న ఉగాది నాడు ప్రారంభించ తలపెట్టిన పి-4 (పబ్లిక్ పీపుల్ ప్రయివేట్ పార్ట్నర్ షిప్) పాలసీ అమలు పై గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు.
అందులో భాగంగా జిల్లా జనాభాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అత్యంత ప్రాధాన్యతతో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
ఎన్జీవోలు, ఎన్ఆర్ఐ లు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు వివిధ రంగాల నిపుణులను భాగస్వామ్యం, వారి నైపుణ్యం, వనరులు, మార్గదర్శకత్వాన్ని పంచుకోవడం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు.
జిరో పావర్టీ, పి-4, నియోజకవర్గ విజన్ ప్లాన్ ను ఒక సమిష్టి శక్తిగా అమలు చేయాలన్నారు.
అందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో, ప్రభుత్వం జీరో పావర్టీలో భాగంగా పి-4 విధానంపై అందరి ఆలోచనలు, అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరు అంతర్భాగంగా చొరవ చూపాలన్నారు.
ఈ ప్రణాళికలో భాగంగా ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరించడానికి పబ్లిక్ కన్సల్టేషన్ కోసం రూపొందించిన ప్రశ్నపత్రం సర్వేను ప్రణాళికా విభాగం రూపొందిస్తుందన్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 7 నుండి 22వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వేలో జిల్లా పౌరులను భాగస్వామ్యం చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.
స్వర్ణ ఆంధ్ర విజన్ 2047ను సక్రమంగా అమలు చేయడానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ.. రానున్న 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.