నారద వర్తమాన సమాచారం
త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోటప్పకొండ పరిసరాలను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే .
ఈ నెల(ఫిబ్రవరి 26 – 2025) జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ అధికారులు సన్నద్ధంగా వుండాలని ఆదేశించిన ఎస్పీ.
తిరునాళ్ళకు సంబంధించి వివిధ ఏర్పాట్ల(వాహన రాకపోకలు, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటు, ప్రభలు నిలుపు ప్రదేశాలు ఎంపిక మొదలైనవి) కొరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి అని పోలీస్ అధికారులకు ఆదేశించిన ఎస్పీ .గత సంవత్సరం తిరునాళ్ళ సమయంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తలెత్తితే, దానికి కారణం తెలుసుకుని ఈ సంవత్సరం మరల ఆ విధమైన సమస్య ఉత్పన్నమవకుండా చూడాలని సూచించారు.
రోడ్లు మరియు భవనాల శాఖ వారి సమన్వయంతో ఎక్కడైనా రోడ్లు వెడల్పు చేయించడం, రోడ్డు మార్గాలలో అవాంతరాలు వుంటే తొలగించడం, చిన్న చిన్న బ్రిడ్జి లు మరియు కల్వర్టు లను బాగు చేయించడం మొదలగు పనులు చేయించాలని సూచించారు.ఆలయ అధికారులతో మాట్లాడి కొండ పైన ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గుడి చుట్టూ బారికేడ్లను వేయించాలని సూచించారు.ప్రభలు నిలుపు ప్రదేశాలు పరిశీలించి, ప్రభలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంతరాలు ఎదురవకుండా, ఎక్కడా ఏటువంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవకుండా ఉండేందుకు తగిన చర్యలు తెసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ,కలెక్టర్,జాయింట్ కలెక్టర్ తో పాటు అదనపు ఎస్పీ (ఏఆర్) వి. సత్తి రాజు, నరసరావుపేట డిఎస్పీ కె.నాగేశ్వర రావు, ఎస్బి సీఐ 2 పి.శరత్ బాబు,నరసరావుపేట రూరల్ సీఐ పి.రామ కృష్ణ మరియు ఎస్సై కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.