నారద వర్తమాన సమాచారం
కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశం
నరసరావుపేట ,
పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ 0- 5 సం. ఆధార్ ఎన్రోల్మెంట్స్ కంప్లీట్ అవ్వాలని సూచించారు. 0- 5 సం. మరియు 15 నుంచి 17 సంవత్సరాల మాండేటరీ బయోమెట్రిక్ పెండింగ్స్ కంప్లీట్ చేయాలని తెలిపారు. మొత్తం పల్నాడు జిల్లాలో 107 ఆధార్ కిట్లు ఉంటే వాటిలో 63 ఆధార్ కిట్లు వివిధ మండలాల్లో పనిచేస్తున్నాయన్నారు. మిగతా 44 కిట్లు కొన్ని హార్డ్వేర్ సమస్యలు ఉండటం వలన పనిచేయడం లేదని వాటిని మొత్తాన్ని పని చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని ఆధార్ సెంటర్స్ ఆపరేటర్స్ అందరూ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లోడ్ చేయాలన్నారు. ఎందుకంటే ఎర్రర్స్, పెనాల్టీస్ ని తగ్గించడానికి, ఆధార్ సర్వీసెస్ యొక్క ప్రైస్ చార్ట్ ను ప్రతి ఒక్క ఆధార్ కేంద్రాల్లో తప్పనిసరిగా డిస్ప్లే చేయవలసిందిగా తెలియజేశారు. డిస్టిక్ జిఎస్డబ్ల్యూస్ ఆఫీసర్ ఎం. వెంకట రెడ్డి, మరియు డిస్టిక్ కోఆర్డినేటర్ (ఆధార్) ఎం. రమేష్ వారిని ఫీల్డ్ లెవల్లో అమలుపరచాలని మరియు మిగతా అధికారులను వీరికి సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.