నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా..
ప్రమాదాల నివారణకు జిల్లాలో కొనసాగుతోన్న “ఫేస్ వాష్ అండ్ గో “
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు..
రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా “ఫేస్ వాష్ అండ్ గో ” కార్యక్రమం చేపట్టారు..
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తమ సిబ్బందితో అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు, తదితర వాహనాల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.
లారీలు, కార్లు, వ్యాన్లు, బస్సులు, తదితర వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు పోలీసు అధికారులు సూచించారు.
రాత్రివేళ జిల్లా వ్యాప్తంగా పోలీసులు గస్తీలు నిర్వహించి బస్టాండు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు.
అదేవిధంగా ఏటీఎంలు, బ్యాంకులు గస్తీలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊరి చివర ఉన్న కాలనీలలో ముమ్మరంగా గస్తీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలింగ్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకుపల్నాడు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.