నారద వర్తమాన సమాచారం
భక్తులకు ఇబ్బందులు కలగకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు..రాష్ట్ర పండుగ హోదాలో వేడుకలకు సిద్ధం
భక్తులకు సౌకర్యవంతంగా దేవదేవుడి దర్శనం
ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు
భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళిక
మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తు లందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే విధంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఈనెల 26న మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు, భక్తుల క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, రవాణా, శానిటేషన్, భక్తులకు తాత్కాలిక వసతి తదితర సౌకర్యాలపై అధి కారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కోటప్ప కొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ప్రత్తిపాటి సూచించారు. లక్ష లాది మంది భక్తులు తరలివచ్చే ప్రాంతం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించ డంతో పాటు కోటప్పకొండ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.
దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా మైక్ ప్రచార కేంద్రం నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటప్పకొండ ఎంతో అభివృద్ధి జరిగిందని, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ కోటప్పకొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రమైన కోటప్పకొండ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కోటప్పకొండ నిర్వహణను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా పూర్తిస్థాయిలో మౌలిక సదుపా యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.