నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
కోటప్పకొండ తిరునాళ్ళు- సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి -పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు శ్రీ త్రికొటేశ్వర స్వామి వారిని స్వేచ్చగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహలకు వెళ్ళడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవలసిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని, తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట చిలకలూరిపేట సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి పార్కింగ్ స్థలాల గురించి క్రింద తెలిపిన సూచనలను పాటించాలని ఎస్పీ తెలిపారు
నరసరావుపేట వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-
- నరసరావుపేట నుండి కోటప్పకొండ కు వచ్చు భక్తులు/VIP లు మొదలగు వారు, వారి వారి వాహనాలలో/RTC బస్సులలో ఉప్పలపాడు, పెట్లూరివారి పాలెం గ్రామం ఘాట్ రోడ్డు పక్కన గల VIP పార్కింగ్ నందు ప్రదేశమునకు చేరుకుని, క్రమ పద్ధతిలో వాహనాలను పార్కింగ్ చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో కొండపైకి చేరుకోవాలి.
- తిరుగు ప్రయాణంలో పార్కింగ్ వెనుక వైపు ఏర్పాటు చేయబడిన మట్టి రోడ్డును ఉపయోగించి కొండకావూరు, పమిడిమర్రు మీదుగా పమిడిమర్రు రోడ్డును చేరి JNTU కాలేజీ మీదుగా నరసరావుపేట, వినుకొండ హైవే పైకి చేరుకొని తిరిగి వెళ్ళవలయును.
- నరసరావుపేట నుండి కోటప్పకొండకు వచ్చే ప్రభలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి ఎల్లమంద, గురువాయపాలెం గ్రామాల మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రభల నిధి వద్దకు చేరుకోవాలి.
తరువాత అనుమతించబడవు.
సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-
- సంతమాగులూరు మరియు అద్దంకి మండలాల నుండి వచ్చు భక్తులు మిన్నెకల్లు నుండి లక్ష్మీపురం, వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకొని పెట్లూరి వారి పాలెం మీదగా ఘాట్ రోడ్డు పక్కన గల జనరల్ పార్కింగ్ కు వెళ్లవలెను.
మిన్నేకల్లు నుండి కోటప్పకొండ వైపు వాహనాలు అనుమతించబడవు.
- సంతమాగులూరు మరియు అద్దంకి మండలం నుండి ప్రభల వద్దకు వచ్చు వారు మిన్నెకల్లు తంగేడు మల్లి, గురిజేపల్లి, U.T గ్రామాల మీదుగా ప్రభల నిధికి చేరుకోవాలి.
మినెకల్లు నుండి కోటప్పకొండ వైపు ట్రాఫిక్ అనుమతింపబడదు.
చిలకలూరిపేట వైపు నుండి వచ్చు వాహనదారులు :-
- చిలకలూరిపేట నుండి వచ్చు భక్తులు పురుషోత్తపట్నం, యడవల్లి, UT సెంటర్ నుండి క్వారీ (క్రషర్) మార్గం గుండా వచ్చి వీఐపీ పార్కింగ్ నందు వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.
- తిరుగు ప్రయాణంలో క్రషర్ రోడ్డు మీదుగా UT జంక్షన్ ను చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా చెరువు రోడ్డు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.
- చిలకలూరిపేట నుండి వెళ్ళు ప్రభలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా UT జంక్షన్ చేరి నిధి దారి గుండా ప్రభల స్టాండు కు చేరవలెను.
8.చిలకలూరిపేట నుండి వచ్చు ట్రాక్టర్లు పురుషోత్తపట్నం, యడవల్లి, అట్టల ఫ్యాక్టరీ రోడ్ నుండి కట్టుబడివారిపాలెం మీదుగా ప్రభల స్టాండ్ కు చేరవలెను. - ఘాట్ రోడ్డులో నడిచి వెళ్ళు భక్తులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించబడదు.
- కొండపైకి వెళ్లి భక్తులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెట్ల దారిలో మాత్రమే నడిచి వెళ్ళవలెను.
- AM రెడ్డి కాలేజీ ఎదురుగా గల పోలీసు చెక్పోస్ట్ నుండి కోటప్పకొండ వైపు వాహనాలకు అనుమతి లేదు.
- యలమంద, గురువాయపాలెం వైపు నుండి వచ్చు భక్తులు బాతింగ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జ్ ను చేరి, యాదవ సత్రంనకు వెనుక గల పార్కింగ్ ప్రదేశం నందు వాహనాలను పార్కు చేసుకొనవలెను.
- రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి నరసరావుపేటకి వెళ్ళు వాహనాలు, చిలకలూరిపేట మేజర్ కెనాల్ మీద ఏర్పాటు చేసిన రూట్ లో మాత్రమే వెళ్లి AM Reddy కాలేజి వద్ద నరసరావుపేట బైపాస్ కు వెళ్లవలయును. గురవాయపాలెం, యల్లమంద మీదుగా నరసరావుపేట వైపుకు వెళ్ళుటకు ఎటువంటి వాహనములు అనుమంతించబడవు. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి భక్తులు మీకు అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను. భక్తులకి పోలీసు వారి ముఖ్య గమనిక
- మీ విలువైన వస్తువులు అనగా సెల్ ఫోన్లు, బంగారం మరియు డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి.
- మీ వాహనాలను మీకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోగలరు. రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపరాదు.
- చిన్నపిల్లలని మీ వెంట జాగ్రత్తగా తప్పిపోకుండా చూసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరైనా పిల్లలు గానీ, పెద్దలుగానీ తప్పిపోయిన యెడల కంట్రొల్ రూమ్ నందు సంప్రదించగలరు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.