నారద వర్తమాన సమాచారం
మోదీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ !
అమరావతి పనులను రీ లాంఛ్ చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిధుల సమీకరణ నుంచి .. టెండర్ల వరకూ చాలా పనులను చక్కబెట్టారు. ఇప్పుడు అధికారికంగా పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలోనూ ఆయనే శంకుస్థాపనకు వచ్చారు. అప్పట్లో పునాదల వరకూ జోరుగా సాగిన పనులు.. వైసీపీ రావడంతో ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతున్నాయి.
అమరావతికి మోదీ సంపూర్ణ సహకారం
అమరావతి మళ్లీ దిగ్విజయంగా పట్టాలెక్కుతోందంటే దానికి కారణం ఖచ్చితంగా ప్రధాని మోదీనే. వైసీపీ పదేళ్ల పాలన తర్వాత రాష్ట్రం నెత్తిన పది లక్షల కోట్లకుపైగా అప్పు పడింది. చిన్న ఖర్చు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అలాంటి సమయంలో అమరావతి కోసం నిధులు కేటాయించలేరు. కానీ మోదీ మాత్రం అండగా నిలిచారు. వివిధ రకాల రుణ సదుపాయాలతో మొత్తంగా యాభై వేలకోట్ల వరకూ నిధులు అందుబాటులోకి వచ్చేలా చేశారు. ఇది అసాధారణమైన సాయమే. అది మోదీ వల్లనే సాధ్యం అయింది.
అమరావతికి మొదటి నుంచి అనుకూలమే !
ప్రధాని మోదీ అమరావతికి మొదటి నుంచి అనుకూలమే. 2014-19 మధ్య పూర్తి స్థాయి సహకారం ఇచ్చారు. అయితే అప్పట్లో నిధుల విషయంలో విమర్శలు వచ్చాయి. కానీ అప్పట్లో అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఆ సమస్య వచ్చింది. అమరావతి సాగుతున్న కొద్దీ నిధులు అందుబాటులోకి వచ్చే సాయం చేయాలని అనుకున్నారు. ప్రపంచబ్యాంక్ సహా పలు సంస్థల నిధులు వచ్చేందుకు సాయం చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి నిధులు అవసరం లేదని నేరుగా లేఖలు రాశారు. ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రభుత్వం ఇలా లేఖలు రాస్తే కేంద్రమైనా.. ఏం చేస్తుంది?. బలవంతంగా అమరావతి కట్టమని ఒత్తిడి చేయలేదుగా . వైసీపీ విధానానికి.. మద్దతుగా.. వ్యతిరేకంగా నిలబడకుండా.. ప్రజాస్వామ్యబద్ధంగా.. సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించింది. కానీ తమ వరకూ తమ విధానాన్ని స్పష్టం చేయాలనుకున్నప్పుడు అమరావతికే మద్దతు పలికింది.
అమరావతికి కేంద్రం అండదండలూ ఎప్పుడూ అవసరమే !
అమరావతి సస్టెయినబుల్ ప్రాజెక్టు. అందులో సందేహం లేదు. నిర్మాణం సజావుగా సాగినప్పుడు ఓ రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ సమకూరినప్పుడు ..ఉపాధి కేంద్రంగా మారినప్పుడు..ఈ సస్టెయినబుల్ అనే పదానికి సరైన అర్థం వస్తుంది. అలా జరగాలంటే.. కేంద్ర ప్రభుత్వ సాయం తప్పని సరి. అందుకే నరేంద్రమోదీ మరోసారి పనుల్ని రీలాంఛ్ చేస్తే శరవేగంగా పూర్తి చేసే అవకాశం కూడా లభిస్తుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.