నారద వర్తమాన సమాచారం
ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి..
కూనవరం :-
రాష్ట్ర సీపీఎం పార్టీ పిలుపు మేరకు మండలంలోని బొజ్జరాయి గూడెంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు.బొజ్జరాయి గూడెంలో ప్రారంభమైన యాత్ర గ్రామాల్లో తిరుగుతూ కూటూరు గ్రామాలకు చేరుకుంది.స్థానిక గ్రామాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులతో మాట్లాడారు.ఎ సందర్బంగా రైతులు మాట్లాడుతూ పొగాకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. అనంతరం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య జిల్లా కమిటీ సభ్యులు పాయం ఎ
సీతా రామయ్య మాట్లాడుతూ జీ. ఓ నెంబర్ 3ని అమలు చేయాలని అన్నారు.1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.మండలంలోని ప్రయారీటీ గ్రామాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని అన్నారు. భీమవరం నుండి బురద గూడెం వరకు ఆర్ అండ్ బీ రోడ్డు మీదుగా కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రతి యేటా వరదలకు మునుగుతూ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు.స్థానికంగా ఉన్న పాఠశాలలు, అంగన్వాడీలు, రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందని వాటికి వెంటనే బడ్జెట్ కేటాయించాలని అన్నారు. పార్టీలతో సంభంధం లేకుండా ప్రతి నిర్వసితుడు ఈ యాత్రలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటూరు సర్పంచ్ బొగ్గా వెంకమ్మ ఎంపీటీసీ జయసుధ,మడెం బాబురావు,లింగ పురం సర్పంచ్ శంకర్,తెల్లం తమ్మయ్య నానుపల్లి వెంకటేశ్వరావు,గుండం బాబురావు, తొండా లక్ష్మణ్,సుమన్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.