నారద వర్తమాన సమాచారం
పోగొట్టుకున్నదొంగిలించబడిన సెల్ ఫోన్ల రికవరీ, చేసి యజమానులకు అందజేసిన పల్నాడు జిల్లా పోలీసులు
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ , ఆదేశాల మేరకు సుమారు 31.22 లక్షల విలువైన 223 దొంగిలింపబడిన మరియు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు
ఈరోజు(13.03.2025) జిల్లా పోలీస్ కార్యాలయము నందు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ,ప్రస్తుత కాలంలో సమాచార చేరవేతకు, వినోదానికి, విజ్ఞాన సమూపార్జన కొరకు మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాలా సందర్భాల్లో ప్రజలు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగలింపబడటం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏమి చేయాలో దిక్కు తోచలేని పరిస్థితుల్లో పోలీసు వారిని ఆశ్రయిస్తున్నారు.పోలీసు వారు పోయిన సెల్ ఫోన్ల యొక్క వివరాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,పోలీస్ వారు వాటిని వెతికి ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేకుండా బాధితులకు అందజేస్తున్నారు.బాధితులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారుఎవరైనా ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఎడల వెంటనే CEIR వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (పరిపాలన) J.V. సంతోష్ , నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు, సత్తెనపల్లి డి.ఎస్.పి హనుమంతరావు , గురజాల డిఎస్పి జగదీష్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.