నారద వర్తమాన సమాచారం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం మంత్రి శ్రీకృష్ణదేవరాయలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ లోక్ సభ వేదికగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్ళలో ఏపీలో సుమారు 99 వేల కోట్ల రూపాయల రూపాయల కుంభకోణం జరిగిందని… అందులో సుమారు నాలుగువేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో వైసీపీ నేతలు దుబాయ్ కు తరలించారని ఆరోపించారు.
అంతేకాదు ఈ మద్యం కుంభకోణం బయటకు వస్తుందని తెలిసి… వైసీపీకు చెందిన ముఖ్య నేత నాలుగేళ్ళు రాజ్యసభ పదవిని సైతం వదులుకుని శాశ్వతంగా రాజకీయాలకు దూరం జరిగారని ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. దీనిపై ఉన్నత స్థాయి అంటే సీబీఐ, ఈడీ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈ మద్యం కుంభకోణంపై మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు… తాజాగా సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తే అవసరమైన పత్రాలు, సమాచారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు, పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఈ కుంభకోణం విషయంలో మౌనం వహిస్తే… రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







