నారద వర్తమాన సమాచారం
పసిపిల్లల ప్రాణాలు కాపాడండి సార్..!!
—డా. చదలవాడ హరిబాబు,
జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు.
గుంటూరు నగరానికి సమీపంలోని గ్రామంలో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డా. చదలవాడ హరిబాబు, బీరాల నాగేశ్వరరావు, గాయకోటి బేబీ సరోజినీ, మునిపల్లె కవిత తో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ తో తనిఖీ చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినవి. ఫ్యాక్టరీ యజమాని ప్యాకేజింగ్ లైసెన్సు డిపార్ట్మెంట్ నుండి తీసుకొనలేదు, మరియు అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ కాటాకు స్టాపింగ్ వేయించుకొనలేదు. ప్యాకేజీ కమోడిటీ చట్టం ప్రకారము ఒక మిల్లి గ్రాము ఖరీదు నమోదు చేయలేదు. కూల్ డ్రింక్ యాపిల్, ద్రాక్ష, పైనాపిల్, మామిడి రసాయన రంగులు, సాక్రిన్ తో తయారు చేయడమును ప్రశ్నించగా పల్ప్ తో చేస్తున్నామని బకాయించాడు. ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ కేసు నమోదు చేయగా తదుపరి విజిలెన్స్ కమిటీ సభ్యులు మొత్తము ఫ్యాక్టరీని సందర్శించిన విషయము గుంటూరు ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి నూతలపాటి పూర్ణచంద్రరావుకు వివరించి ఫ్యాక్టరీ వారు నడుపుతున్న ఆర్వో ప్లాంట్ నీరు సేకరించి మైక్రో బయాలజీ, కెమికల్ ఎనాలసిస్ పంపవలసినదిగాను, చిన్నపిల్లల ఆరోగ్యమునకు హాని కలుగజేసే డ్రింక్స్ శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపవలసినదిగా కోరుట జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.