నారద వర్తమాన సమాచారం
వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ!
వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగోడి కీలకపాత్ర
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ వంతెన ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారంనాడు ప్రారంభించారు.
అనంతరం జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం- తాంబరం రైలును వర్చు వల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర వంతెన ఇది. రామసేతువు తో చారిత్రక సంబంధం ఉ న్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాంబన్ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకు స్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయిం చింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది.
ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా వర్టికల్ లిఫ్ట్ రూపొందిం చారు.
మోటార్ల సాయంతో రిమో ట్ కంట్రోల్ ద్వారా లిఫ్ట్‌ను ఎత్తుతారు. 660 టన్నుల బరువైన 72.5 మీటర్ల వంతెన భాగాన్ని ఇప్పుడు కేవలం 5.20నిమిషాల్లో పూర్తిస్థాయిలో పైకి లేప వచ్చు. ఈ వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్త యిన ఓడలు కూడా వెళ్ల గలవు. ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పె యిన్ నుంచి తీసుకురాగా,
మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. విజయ నగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్ ఇంజనీర్ నడుపూరు చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో క్రియా శీలక పాత్ర పోషించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.