నారద వర్తమాన సమాచారం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల,రక్షణా,చట్టం పై అవగాహన కలిగి ఉండాలి..వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ*
ఏ.పి. వినియోగదారుల హక్కుల పరిరక్షణా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ
పల్నాడు జిల్లా, నరసరావుపేట : ఏ.పి. వినియోగదారుల హక్కుల పరిరక్షణా సంస్థ ఏంజెల్ ప్రైడ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం నరసరావుపేట పట్టణ ఎల్.బి. కూరగాయల మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం ఫంక్షన్ హాల్ నందు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
సంస్థలో చేరిన ప్రతి సభ్యున్ని వినియోగదారుల హక్కులకై పోరాడే యోధులుగా తయారు చేస్తామని, ప్రతి ఒక్కరు వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాంపై పూర్తి అవగాహన కలిగి ప్రజలకు అవగాహన కలిగించాలని, నష్టపోయినా వినియోగదారులకు న్యాయ పరంగా రక్షణ పొందెందుకు సహాయ సహకారాలు సంస్థ ద్వారా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులకు నియామక పత్రాలు, సంస్థ ఐ.డి. కార్డులు అందజేశారు. ఈ సందర్బంగా నూతన సభ్యులు కట్టెపొగు కిరణ్ కుమార్ ను రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గాను, నాగెండ్ల వెంకటేశ్వర్లును రాష్ట్ర ఉపాధ్యక్షులు గాను, బెల్లంకొండ నాగసాయి ప్రసాద్ ను రాష్ట్ర కోశాధికారి గాను, పొన్నెకంటి శ్రీనివాసాచారిని రాష్ట్ర గౌరవ సలహాదారునిగా, రెబ్బా ఆదినారాయణను రాష్ట్ర ఉప కార్యదర్శిగా నియామకా పత్రాలు మరియు ఐ.డి. కార్డులు అందజేశారు. వీరితో పాటు పల్నాడు జిల్లా నందు,ఓబులపురం రమాదేవిని జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, షైక్ షాముల్లా ను జిల్లా ఉప కార్యదర్శిగా, తుమ్మలపల్లి యోగయ్యను ఇ.సి. మెంబర్ గా, రమావత్ వెంకటేశ్వర్లు నాయక్ ను ఇ.సి. మెంబర్ గా నియామకా పత్రాలు మరియు ఐ.డి. కార్డులు అందజేశారు. వీరితో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన సభ్యులు పాల్గొని వారివారి ప్రాంతాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ దృష్టికి తీసువచ్చారు. వారు తెలిపిన సమస్యలను సంస్థ అధ్యక్షులు త్వరలో సంబంధిత అధికారులను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.