నారద వర్తమాన సమాచారం
రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలిప్రాధాన్యత : మాజీమంత్రి ప్రత్తిపాటి
- ఎన్.ఎస్.పీ మెయిన్ కెనాల్ అనుబంధ మేజర్లలో కంప, పూడిక తొలగింపు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
- స్వయంగా ఎక్సకవేటర్ తో పూడిక తొలగించిన ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాల్లో కూటమిప్రభుత్వం రాజీపడదని, గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న చంద్రబాబు సంకల్పం కచ్చితంగా సాకారమవుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గంలోని ఎన్.ఎస్.పీ కెనాల్ మెయిన్ కెనాల్ పరిధిలోని ఎన్.ఆర్ మేజర్, పెదనందిపాడు,, తుర్లపాడు మేజర్ కాలువల్లోని కంప, పూడిక తొలగింపు పనుల్ని మంగళవారం ప్రత్తిపాటి ప్రారంభించారు. స్వయంగా ఎక్సకవేటర్ నడిపి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. కోటిరూపాయల వ్యయంతో, ప్రధాన మేజర్లలో 24చోట్ల పూడిక తొలగింపు పనులు ప్రారంభించడం జరిగిందని, పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ప్రత్తిపాటి సూచించారు. ఏదో మొక్కుబడిగా కాకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా పూడికతీత పనులు జరగాలన్నారు. నీటిప్రవాహానికి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో గుర్తించి, రైతుల అభిప్రాయాలు తెలుసుకొని పనులు చేయాలన్నారు. తొలగించిన కంపను కాలువగట్లపై అలానే వదిలేయకుండా వెంటనే దాన్ని తొలగించాలని ప్రత్తిపాటి అధికారులకు సూచించారు. నీటిసంఘాల అధ్యక్షులు రైతులతో మాట్లాడుతూ, పనుల్ని నిత్యం పర్యవేక్షించాలని పుల్లారావు చెప్పారు. కంప, పూడిక తొలగింపు ఎప్పట్లోగా పూర్తిచేస్తారని ప్రత్తిపాటి ప్రశ్నించగా, నెలలోపు పూర్తిచేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. నెలతర్వాత మరలా పనులు పరిశీలిస్తానని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే, సరిగా చేయని పనుల్ని మరలా కాంట్రాక్టర్ తో చేయిస్తానని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, కుర్ర రత్తయ్య, వెంకట రత్తయ్య, రాఘవయ్య, మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పోపూరి రామారావు, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, తోకల రాజేష్, పోతురాజు, కల్లూరి శ్రీనివాసరావు, డి.ఈ శ్రీనివాసరావు అధికారులు తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.