నారద వర్తమాన సమాచారం
ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహంతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి : మాజీమంత్రి ప్రత్తిపాటి
“ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇవనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడటం దురదృష్టకరం. ప్రమాదవార్త తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యాను. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ త్వరగా కోలుకొని, మునుపటిలా తల్లిదండ్రులతో ఉల్లాసంగా గడపాలి. దైవానుగ్రహం, ప్రజల ఆశీస్సులతో మార్క్ క్షేమంగా ఇంటికి చేరాలి. కుమారుడి ప్రమాద వార్తపై ఆందోళన చెందక దైర్యంగా ఉండాలని పవన్ ను కోరుతున్నాను. కేంద్రప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి మార్క్ శంకర్ కు, అగ్నిప్రమాదంలో గాయపడిన మిగిలిన పిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి” అని ప్రత్తిపాటి పుల్లారావు ఒకప్రకటనలో కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.