నారద వర్తమాన సమాచారం
టెర్రరిస్టు తహవూర్‌కు ఉరే సరి – వేగంగా !
దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేద్దామనుకున్న ముంబై పేలుళ్లు కుట్రదారుల్లో ఒకరు తహవ్వూర్ రాణాను చాలా సుదీర్ఘ పోరాటంతో ఇండియాకు తీసుకు వచ్చారు. అమెరికా జైల్లో ఉన్న ఆయనకు అక్కడ న్యాయపోరాటం చేశారు. ట్రంప్ తో మోదీ మాట్లాడి వెంటనే తీసుకు వచ్చారు. ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న వస్తోంది.
ఇండియాలో అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
ఢిల్లీకి రాణాను తీసుకు వచ్చిన విమానం ల్యాండ్ కాగానే ఎన్ఐఏ తహవ్వూర్ రాణాను అధికారికంగా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఆయన ఎంత ప్రమాదకారి వ్యక్తో.. దేశంపై ఎలా దాడి చేశాడో వివరించింది. తీహార్ జైల్లో అత్యంత భద్రత ఉండే టెర్రరిస్టుల్ని పెట్టే బ్యారక్‌లో పెట్టి.. ఇరవై నాలుగు గంటలూ ఆయన పై నిఘా పెడతారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న వస్తోంది.
శిక్ష ఖరారుకు ఎంత కాలం ?
వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషిగా శిక్ష పడకూడదు అనేది భారత న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రం. ఈ కారణంగా న్యాయం కూడా ఆలస్యం అవుతుంది. అనేక లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని నేరస్తులు తప్పించుకుపోతున్నారు. న్యాయం అందే వారికి అది ఆలస్యమైపోతుంది. కసబ్ ను ఉరి తీయడానికి ఎంత కాలం పట్టిందో అందరూ చూశారు. ఇప్పుడు తహవ్వూర్ ను ఎంత కాలం మేపుతారన్న ప్రశ్నలు కూడా అందుకే వస్తున్నాయి. ఎంత త్వరగా శిక్ష వేసి అమలు చేస్తారన్నది కీలకం.
ఆలస్యం చేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడి!
తహవ్యూర్ రాణాకు శిక్ష వేయడంలో ఆలస్యం చేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఆమె కెనడా సిటీజన్, అమెరికన్ సిటిజన్ కాదు. కానీ అమెరికా జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ్నుంచి తెచ్చారు. ఉరి శిక్ష వేయాలంటే కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించడానికి.. ఆలస్యం జరగకుండా చూడటానికి.. వెంటనే శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.