నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు నరసరావు పేట రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సీఐ Ch.లోకనాథం రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించడం జరిగింది.
రోడ్డు భద్రతపై ఆటో,టాక్సీ డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పల్నాడు జిల్లాలో రోడ్డు భద్రత పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యార్థినీ, విద్యార్థులకు, యువతకు, ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు, ద్విచక్ర వాహన దారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ…
హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుం డా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.
పిల్లలపై చాలా గురుతర బాధ్యతలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములతో సుఖసంతోషాలతో ఉండాలంటే పెద్దలకు రోడ్డు భద్రత గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పించారు.
విద్యార్థులు రోడ్ క్రాస్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు, లైసెన్స్ లను చోదకులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని అన్నారు.
పౌరులందరూ రోడ్డు భద్రతా నియమాలకు కట్టుబడినప్పుడే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు.
ఆటో, టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించాలని, క్రమశిక్షణతో వాహనం నడపాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని తెలిపారు.
పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నా రు.
డ్రైవింగ్ చేసేటప్పుడు మానసిక, శారీరక ఏకాగ్రత ఎంతో అవసర మన్నారు. ఇతర ఆలోచనలతో, అతి వేగంతో వాహనాలు నడపరాదని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.