నారద వర్తమాన సమాచారం
శంకర్ విలాస్ వంతెన విస్తరణలో భాగంగా భూసేకరణకు అంగీకారం తెలిపిన షాపుల యజమానులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో సోమవారం జరిగింది.
పెమ్మసాని కామెంట్స్
నందివెలుగు బ్రిడ్జి 2014లో మంజూరు అయితే 2017 వరకు పనులు జరిగాయి.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల మొత్తం ప్రక్రియ మూలన పడింది.
తిరిగి మళ్లీ కూటం ప్రభుత్వం వచ్చాకే నందివెలుగు ఆర్ఓబి కి పునర్ వైభవం వస్తుంది.
ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందనడానికి ఇదే ఒక ఉదాహరణ.
అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నాయకులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అందరి మద్దతుతో కేవలం నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు రాగలిగాం.
కొందరి కోసం ఈ వంతెన ఆగదు
ఈ నేపథ్యంలో కొందరు కావాలని ప్రజల్లో కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం లేనిపోని అపోహలు సృష్టించొద్దు.
ఆర్ఓబి కంటే ముందు ఆర్ యు బి ముందుగా కట్టాలంటున్నారు.
ఆర్ యు బి ఏర్పాటు చేయాలంటే పిల్లర్ల కోసం లోతైన గోతులు తీయాలి. ఆ తర్వాత ఆర్ఓబి నిర్మాణం చేయడానికి మళ్లీ పిల్లర్ల నిర్మాణం అనేది భద్రతా కారణాల రీత్యా అసాధ్యం అవుతుంది.
కొందరు ఇలా మాట్లాడేవన్నీ నిజమే అనుకొని గతంలో మేము కూడా అనేకసార్లు వాళ్లతో సంప్రదింపులు జరిపాము. అధికారులతో, మాతో జరిగిన సమావేశాల్లో కూడా కూర్చోబెట్టాం.
వాళ్ల సలహాలను పరిగణలోకి తీసుకొని ఆర్ ఓ బి నిర్మాణ డిజైన్లలో ఉపయోగించాలని సూచించాం.
వీళ్ళు చెప్పే ప్రతిపాదనలను పరిశీలిస్తే అది ఫ్లైఓవర్ అవుతుంది తప్ప ఆర్.ఓ.బి అవ్వదు.
ఈ వంతెన నిర్మాణాన్ని ముందుకు వెళ్లకుండా చేయడమే ఆలోచనగా కొందరు ప్రయత్నిస్తున్నారు.
బ్రిడ్జి ఒకప్పుడు 430 మీటర్లు ఎత్తు ఉంటే, ఇప్పుడు 900 మీటర్లకు పైగా నిర్మించబోతున్నాం.
రాబోయే 50 ఏళ్లకు సరిపడా ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే ఈ ఆర్ ఓ పి నిర్మాణ లక్ష్యం.
అలాంటి ఈ వంతెనను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. గతం కంటే ఎత్తును పెంచి 90 మీటర్ల విస్తీర్ణంలో ఈ వంతులను నిర్మిస్తున్నాం. బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో.. మీరే చూడండి.
ప్రజలందరికీ ఉపయోగపడేలా నిర్మించబోయే వంతెనను చూసిన తర్వాత అప్పటికి ఇబ్బందులు ఉంటే మాట్లాడొచ్చు.ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్ , గల్లా మాధవి, బి రామాంజనేయులు తో పాటు కలెక్టర్ నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ , ఇన్చార్జ్ మేయర్ షేక్ సజీల జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.