నారద వర్తమాన సమాచారం
గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్.. .
- షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్: నగరంలో నిర్వహించే బోనాల సంబరాల షెడ్యూల్‌ను దేవాదాయశాఖ అధికారులు విడుదల చేశారు. చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్ బోనాల తేదీలను కూడా ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఈ బోనాల సంబరాలు మొదలు కానున్నాయి. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ఒకటి.
రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ తేదీలను పరిశీలిస్తే.. చారిత్రక గోల్కొండ కోట శ్రీజగదాంబిక అమ్మవారి బోనాలు జూన్ 26వ తేదీన ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 13న, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి. గతేడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
షెడ్యూల్ ఇదే..
జూన్ 26వ తేదీ గురువారం మొదటి బోనం, 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం, 6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం, 10వ తేదీ గురువారం ఐదవ బోనం, 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, 17వ తేదీ గురువారం ఏడవ బోనం, 20వ తేదీ ఆదివారం 8వ బోనం, 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.