నారద వర్తమాన సమాచారం
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ
వేసవి తాపానికి చల్లని మజ్జిగ ఎంతో ఉపశమనం… పురపాలక సంఘ మేనేజర్ కే శ్రీనివాసరావు…
నరసరావుపేట:-
రోజురోజుకు ఎండ తీవ్రతలు ఎక్కువ అవటంతో వేసవి తాపానికి గురవుతున్నారని, వేసవి తాపానికి చల్లని మజ్జిగ ఎంతో ఉపశమనమని పురపాలక సంఘ మేనేజర్ కే శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పురపాలక సంఘం కార్యాలయంలో కార్మికులకు శ్రామికులకు అధికారులకు, సిబ్బందికి ఒక్కరోజైనా వేసవి తాపాన్ని తీర్చేందుకు చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్..
పల్నాడు జిల్లా సభ్యులు కీర్తిశేషులు తిరుమలశెట్టి గురుమూర్తి, రిటైర్డ్ ఎమ్ ఈ ఓ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మేనేజర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అధికారులకు కార్మికులకు మరియు కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే ప్రజలకు యూనియన్ సంఘ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. వేసవి రోజులలో మండుటెండని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేసవి తాపాన్ని తీర్చే మంచినీటి చలివేంద్రాలు, చల్లటి మజ్జిగ వంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్న దాతలకు యూనియన్ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పురపాలక సంఘ మేనేజర్ కే శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమాదేవి, ఆర్ఐ బెయిలీ బాబు, టిడిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి రవి, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ కదం నాగజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి నాగెండ్ల వెంకటేశ్వర్లు, ఉప కార్యదర్శి వెంకటేశ్వర్లు నాయక్, ఈ సీ మెంబర్లు డి.అక్కయ్య, ఓ.రమాదేవి, సీనియర్ జర్నలిస్ట్ కె.కిరణ్ కుమార్, జిలాని మాలిక్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.